మండవల్లి నుంచి హైదరాబాద్ బయల్దేరిన జగన్

  • కృష్ణా జిల్లాలో కొనసాగుతున్న జగన్ పాదయాత్ర
  • రేపు కోర్టు విచారణకు హాజరుకానున్న జగన్
  • అక్రమాస్తుల కేసులో విచారణను ఎదుర్కొంటున్న వైసీపీ అధినేత
వైసీపీ అధినేత జగన్ తన పాదయాత్రకు స్వల్ప విరామం ప్రకటించారు. ఆయన పాదయాత్ర ప్రస్తుతం కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది. కాసేపటి క్రితం ఆయన మండవల్లి నుంచి హైదరాబాద్ బయల్దేరారు. అక్రమాస్తుల కేసులో ఆయన సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతి శుక్రవారం ఆయన హైదరాబాదులోని సీబీఐ కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. ఈ క్రమంలో పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన జగన్... రేపటి కోర్టు విచారణ కోసం హైదరాబాదుకు బయల్దేరారు.
Go Back to Shorts
jagan
YSRCP
padayatra
cbi
court
case

More Telugu News